నరసింహస్వామి జయంతి వేడుకలు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సొసైటీ చైర్మన్ కోట వెంకటకృష్ణ సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు ,

జనం న్యూస్ మధిర ఏప్రిల్ 30, దోర్నాల కృష్ణ దెందుకూరులో నేడు శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం నందు నృసింహ స్వామి వారి జయంతి కళ్యాణం వైభవంగా జరిగింది సాధారణంగా బ్రహ్మోత్స వాల సమయంలో లేదా నరసింహ జయంతి నాడు లక్ష్మీదేవి, నరసింహ స్వామిల కళ్యాణోత్సవం నిర్వహి స్తారు. ప్రజలు మహిళలు భక్తిశ్రద్ధలతోస్వామి వారి వేడుకలు తిలకించారు. గ్రామపెద్దలు ఆలయ చైర్మన్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలతో ఈ దివ్యమైన కార్యక్రమం జరిపించారు తదుపరి భక్తులు ప్రజలు మహాన్నదానం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.