జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

★ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డికి వినతి పత్రం అందజేసిన ఏపీ ఆదివాసీ జేఏసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ★అనుమతులు లేకుండా కొనుగోలు చేస్తున్న దళారులపై కేసులు నమోదు చేయాలి

జనం న్యూస్/మే 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం జిల్లా కేంద్రమైన ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ క్యాంప్ కార్యాలయం నందు సోళ్ళ బొజ్జి రెడ్డి కి ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలు వేసవికాలంలో జీడి పిక్కలు,మామిడి కాయలు సేకరించడంలో ఎక్కువగా నిమగ్నం అవుతున్నా రన్నారు. అయితే దళారులు ఆదివాసుల నుండి అతి తక్కువ ధరలకు జీడీపిక్కలు, మామిడికాయలు కొనుగోలు చేసి దగా మోసం చేస్తున్నారన్నారు. కావున ప్రభుత్వమే జీడి పిక్కలకు మరియు మామిడి కాయలకు గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే జిసిసిల ద్వారా లేదా రైతు సేవ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఆదివాసీ పేద ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎటువంటి లైసెన్స్ లేకుండా జీడిపిక్కలు, మామిడికాయలు కొనుగోలు చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ప్రతి మండల కేంద్రంలో జిడిపిక్కల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఆదివాసీ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్, రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, యలగాడ నాగేశ్వరరావు, సరస్వతి, కోసూరి రాజారెడ్డి, అందాల లింగారెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.