జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించే చట్టం తేవాలి : ఎన్.హెచ్.ఆర్.ఎ.సి.సి.సి

★నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ నడపాల సోమరాజు డిమాండ్

జనం న్యూస్/మే 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించే చట్టం తేవాలని, జర్నలిస్ట్ లపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ నడపాల సోమరాజు కోరారు. ఈ విషయంపై స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిన్న చిత్తూరు జిల్లా,ఎ.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి మాఫియా చేతుల్లో దారుణ హత్య, అంతకు ముందు అనంతపురంలో గంజాయి మాఫియా చేతుల్లో పెంచలయ్య దారుణ హత్య, నేడు సాలూరులో మరో జర్నలిస్ట్ పై దాడి చేసి గాయపరచడం ఇవన్నీ చూస్తుంటే జర్నలిస్ట్ ల రక్షణ కోసం సరైన చట్టం లేకపోవడం వల్లనే మాఫియాలు రెచ్చిపోయి సామాజిక కార్యకర్తలు,జర్నలిస్ట్ లను హత్య చేస్తున్నారని అన్నారు.ఇలాంటి ఘటనలు జరిగిన రోజు ప్రభుత్వ పెద్దలు,ఉన్నతధికారులు హడావిడి చేయడం, వదిలేయటం జరగడంతో ఒకటి తర్వాత ఒకటి జర్నలిస్ట్ లపై దాడులు జరిగినా, ఇదంతా మాములేనని మాఫియాలు రెచ్చిపోయి హత్యలు, దాడులకు తెగబడుతున్నారు, హత్యకు గురైన జర్నలిస్ట్ లకు కుటుంబం, పిల్లలు ఉంటారని, వారి బాగోగులు నాశనం అవుతాయని ప్రభుత్వo మరియు ఉన్నతధికారులు గమనించ గలరని హితవుపలికారు.ఒక ధైర్యవంతమైన జర్నలిస్టును మాఫియా వ్యక్తి రౌడీషీటర్ తమీమ్,అతని అనుచరులు క్రూరంగా హత్య చేసిన ఈ ఘటన రాష్ట్రంలో పెరుగుతున్న నేర రాజకీయాలకి,అధికార యంత్రాంగం వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన పత్రికారంగంపై దాడి జరగడం అంటే, ప్రజల గళాన్ని మూయించే కుట్రని,మాఫియా శక్తులు ఈ స్థాయిలో దుస్సాహసం చేయడానికి కారణం పాలకుల నిర్లక్ష్యం, నేరస్తులకు లభిస్తున్న రాజకీయ ఆశ్రయం అని అన్నారు.ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి,నిందితులను అరెస్ట్ చేసి,ఫస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్ష విధించాలిని,అలాగే ఈ కేసులో ఉన్న రాజకీయ సంబంధాలపై స్వతంత్ర న్యాయ విచారణ (జుడీషియల్ ఇన్క్వైరీ) జరపాలని కోరారు.జర్నలిస్టుల భద్రతను నిర్లక్ష్యం చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని,ఈ ఘటనపై మేము మౌనంగా ఉండమని, బాధ్యులపై కఠనచర్యలు తీసుకునే వరకు ప్రజలతో కలిసి నిరసనలు కొనసాగిస్తామని అన్నారు.మృతుడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,వారికి న్యాయం జరిగే వరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు.