జనం న్యూస్ ఏప్రిల్ 30 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) గురువారం వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో గోరంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుండి మొత్తం 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై, 70 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి. ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. అలాగే పాఠశాలలో 500కు పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. వీరిలో దేవాంగం కర్ణ సోమశేఖర్ 577 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ఉమేష్ 538 మార్కులతో రెండో స్థానం, నవసాయి 534 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. 500కు పైగా మార్కులు సాధించిన ఇతర విద్యార్థుల్లో బాబాజాన్, ఇమ్రాన్ ఫర్హత్, వికాస్, వరుణ్ కుమార్, శశాంక్, శివమణి, భువన్ రాజ్, నందన కిశోర్, సాయి చరణ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు,బి. ఈశ్వర్ ప్రసాద్ ఉపాధ్యాయ బృందం అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.