జనం న్యూస్ గుండకు మే. 1.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామం లోని పి ఎ సీ యస్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పర్షిలించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రామం నుంచి ఎన్ని లారీలదాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తుంది గిన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులు పండించిన దాన్యాన్ని ఆయన స్వయంగా పర్షిలించారు లారీల కొరత లేకుండా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా దాన్యం కొనుగోలు జరుగాలని ఆయన అన్నారు అదేవిదంగా గ్రామం లో పర్యటించి కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లలబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు ఇటీవలఅకాలంగా మరణించినభూపతి ఇంటికి వెల్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు భూపతి భార్య చదువు కుంటే ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరికృష్ణ ఎం పి. డి. ఓ. చండిరాణి అధికారులు ఉన్నారు.