కూడేరు రైతుల భూములు రీ సర్వే మే 4 నుండి..

★రీసర్వేసిబ్బందికిసహకరించండి రైతులకు సూచన.. ★ఆర్డిఓ కేశవ నాయుడు, డిప్యూటీ ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ భాస్కర్, రీ సర్వే డి టి ప్రసాద్…

జనం న్యూస్, కూడేరు ఏప్రిల్ 30, రిపోర్టర్ ముంగ ప్రదీప్ స్థానిక మండల కేంద్రంలోని కూడేరు, కడదరగుంట గ్రామలు యందు కూడేరు రెవెన్యూ గ్రామాన్నికి సంబంధించి రైతులు భూములు రీ సర్వే మే నెల 4వ తేదీ నుండి మొదలు పెట్టడం జరుగుతుందని. గురువారం కూడేరు సచివాలయం నందు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశమునకు ఆర్డిఓ కేశవ నాయుడు, డిప్యూటీ తాసిల్దార్ ఉదయ భాస్కర్, రీసర్వే డిటి ప్రసాద్, మండల సర్వే రు,అయిషా, వీఆర్వో ఎర్రమ్మ, గ్రామ సర్వే సుజాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,మే 4 తారీఖున నుండీ కూడేరు గ్రామం నందు రైతులు భూములు రీ సర్వే జరుగుతుందిని.కావున రైతులు అందరు మీ భూములు కొలతల నిమిత్తం 2రోజులు ముందే మీకు నోటీసులు ద్వార తెలియజేస్తామని, రీసెర్వికి సంబంధించి ఒక గ్రూప్ నందు కూడా పోస్ట్ చేస్తాము అని సూచించారు. రైతులుతప్పక హాజరై మీ భు హద్దులు గ్రామ సర్వే టీమ్ కు చూపించాలి, అలానే మీరు మీ భూమికి సంభందించి గ్రామ సర్వే టీమ్ కు కచ్చితంగా ఈ క్రింది డాక్యుమెంట్స్ ఇవ్వవలెను
1,పట్టాదారు పాసుపుస్తకాలు నకలూ, 2,అసైన్మెంట్ డి పట్టా నకలు,3,భూమికి సంభందించి ఏవైనా రిజిస్టర్ డాక్యుమెంట్స్ నకులు,4, రైతు ఫోటోలు,5,ఆధార్కార్డు6,ఫోన్ నెంబర్. 7,కులం వివరాలు. 8,ఒకవేళ మీ భూమి చుక్కలు భూమీ ఐ ఉండి గతంలో ఎన్ ఓ సి వచ్చి ఉంటే వాటి నకలు, ఎన్ ఓ సి రాకుంటే ఆర్ హెచ్ కాపీ, ఈసీ 1956 నుండీ 2025,రిజిస్టర్ డాక్యుమెంట్స్ నకలు కచ్చితంగా ఈ సర్వే అధికారులకు అందజేయాలిని రీసర్వే కు వచ్చే సిబ్బందికి రైతులందరూ సహకరించవలెనని. రీ సర్వే డిటి దుబ్బర ప్రసాద్ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో కూడేరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు. వైయస్సార్ పార్టీ నాయకులు. కడదరకుంట, తలపూరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆర్డిఓ కేశవ నాయుడు.2. రీ సర్వే పై ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు రెవెన్యూ సిబ్బంది..