ఒకే రోజు… తల్లిఇంటర్, కొడుకు10వ తరగతి..పాస్.

జనంన్యూస్ ఏప్రిల్ 30, (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) గోరంట్ల పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ప్రాంతానికి చెందిన తల్లి శ్వేత గురువారం వెలువడిన ఇంటర్ ఓపెన్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించగా అదే రోజు వెలువడిన పదవ తరగతి ఫలితాలలో తన కొడుకు జ్ఞానేశ్వర్ 515 మార్కులు సాధించి ఉతీర్ణత సాధించిన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు వెలువడిన ఫలితాలలో తల్లి కొడుకు మంచి మార్కులతో పాస్ కావడం తో పలువురు అభినందించారు.