జనంన్యూస్ ఏప్రిల్ 30 (గోరంట్ల మండలప్రతినిధి ఫక్రోద్దీన్) ఒక ఇంటి స్థలం విషయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో పెనుగొండ కోర్టు విచారణ అనంతరం తీర్పునిస్తూ గోరంట్ల కు చెందిన ఇద్దరికీ మూడు నెలల జైలు శిక్ష, రూ, 10 వేల జరిమానా విధించినట్లు గోరంట్ల సీఐ శేఖర్ తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. గోరంట్ల పోలీస్ స్టేషన్లో 2016 జనవరిలో దాడి కేసు లో గోరంట్ల పట్టణంలోని 4 వద్దకు చెందిన ముద్దాయి అయిన చంద్ర శేఖర్ రెడ్డి, వై రామకృష్ణారెడ్డి లపై అప్పటి ఎస్ ఐ వెంకటేశ్వర్లు క్రైమ్ నెంబర్ 15/2016.u/s 324,326 ఆర్/ డబ్ల్యూ 34, క్రైమ్ నెంబర్ .61/2016 గా కేసు నమోదు చేసి తదనంతరం పెనుగొండ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ అఫ్ ప్రిస్ట్ క్లాస్ కోర్ట్ లో విచారణ జరిగినట్లు తెలిపారు.ముద్దాయిలు జనవరి 31న 2016 న మధ్యాహ్నం 3 గంటల సమయం లో ముకుంద ఫిర్యాదు మేరకు పై ముద్దాయిలు ఇంటి స్థలం విషయంలో ఫిర్యాదు దారుడు పై దాడి చేసి రక్త గాయాలు కలగజేసినాడని గోరంట్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు పై గోరంట్ల పోలీసు స్టేషన్ అప్పటి ఎస్సై వెంకటేశ్వర్లు , కేసు నమోదు చేసి, మరియు విచారణ చేసి దర్యాప్తు అనంతరం,గౌరవ జే ఎఫ్ సి ఎం కోర్ట్ పెనుకొండ కోర్ట్, నందు ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు.ఈ కేసు లో జడ్జి బొజ్జప్ప సాక్షులను విచారించగా, నేరం రుజువు అయినందున గురువారం కేసులోని 02 ముద్దాయిలకు ఒక్కొక్కరికి రూ,10 వేలు జరిమాన మరియు 3 నెలలు జైలు శిక్ష అని తీర్పు చెప్పినారు.ఈ కేసు ను ఏపీపీ శ్యామల ప్రాసిక్యూషన్ తరపున వాదించి ముద్దాయిలకు శిక్షపడేలా కృషి చేసినారు కోర్టు కానిస్టేబుల్ హుస్సేన్ లు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరచి, నిందితునికి శిక్ష పడేందుకు తమ వంతు కృషి చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.