జనం న్యూస్ 30ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :మండలంలోని మార్కగూడ గ్రామానికి చెందిన కినక మాన్కు రబీ పంటలో భాగంగా గోదమ పంటను వేశాడు,ప్రమాదశాత్తు,బయటనుండి మంటలు తన చేనులో ఉన్నా గోదుమ పంటకు మంటలు వ్యాపించడంతో…. చేతికి వచ్చిన పంట మొత్తం కాలిపోయింది, కాలిపోయిన పంటను చూసిన రైతు కన్నీటీ పర్యంతమవుతున్నాడు, ప్రభుత్వం, ఆధికారులు తనను ఆదుకోని నష్టపరిహరం అందించాలని ఆయన వేడుకుంటున్నాడు, పంట మొత్తం కాలిపోవడం తీవ్రమనోవేధనకు గురుఅవుతున్నాడు. ఇట్టి విషయం తెలుసుకున్నా పానపటార్ గ్రామపంచాయితీ సర్పంచ్ గురువారం రైతుతో కలిసి పంటచేనుకు వెళ్లి జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలను తెలుసుకోని ఆధైర్యపడవద్దని, బరోసా కల్పించారు, జిల్లా కలేక్టర్ స్థానిక ఏమ్మెల్యే కోవ లక్ష్మి దృష్టికి ఇట్టి విషయాని తీసుకోని పోయి న్యాయం జరిగే విధంగా కృషిచేస్తానని ఆమె హమీ ఇచ్చారు,రాష్ట్ర ఫ్రభుత్వం పంట నష్టపోయిన పేద రైతును తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వని ఆమె డిమాండ్ చేశారు.