జనం న్యూస్ ఏప్రిల్ 30 పుల్లంపేట, పుల్లంపేట మండలంలోని పుత్తనవారిపల్లి, దలవాయిపల్లి,
పీ.వీ.జీపల్లి, అనంతయ్యగారిపల్లి గ్రామ పంచాయతీలలో,మరియు ఉడుమువారి పల్లి గ్రామంలో బుధవారంకురిసినఅకాలవర్షాలు మరియు భారీ గాలులకారణంగా ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఈ పరిస్థితిని గమనించిన మండల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు,మండల ఉద్యాన శాఖ అధికారి వెంకట భాస్కర్ మరియు సంబంధిత ఆర్.ఎస్.కే సిబ్బంది ప్రభావిత వ్యవసాయ పొలాలను సందర్శించి నష్టాల అంచనా ప్రక్రియను ప్రారంభించారు. ప్రాథమిక పరిశీలన నివేదిక ప్రకారం సుమారు 310 ఎకరాలలో అరటి పంట,12 ఎకరాల లోతమలపాకు తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. మొత్తం 162 మంది రైతులు ఈ నష్టానికి గురైనట్లు సమాచారం. టీడీపీ ఇన్‌చార్జి చంద్రశేఖర్ నాయుడు కూడా కొన్ని ప్రభావిత రైతుల పొలాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం నుండి తక్షణ సహాయం అందేలా పంట నష్టం గురించి సంబంధితఅధికారులకు నివేదిక సమర్పించబడుతుంది అని తెలియజేశారు.హార్టికల్చర్ ఆఫీసర్ వెంకటభాస్కర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో పంట నష్ట నివేదిక పూర్తి చేయాలని,పంటనష్టాన్ని జియో ట్యాగ్ ద్వారా అంచనాలను సక్రమంగా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లత,తేజశ్రీ,సంపూర్ణ, విష్ణు, ప్రవీణ్, మహేష్ మరియు రైతులు తురక ప్రకాష్ రెడ్డి, చిమ్మని నరేష్,పెండ్లిమర్రి శ్రీనివాసులు,రెడ్డిపాకమల్లికార్జున శివ పాల్గొన్నారు.