అమలాపురం భాష్యం విద్యార్థుల మార్కుల ప్రభంజనం

జనం న్యూస్, మే 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలా పురం భాష్యం 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులతో ,వంద శాతం ఉత్తీర్ణతతో తమ సత్తా చాటారు. ఎ.లక్ష్మీ శ్రీహిత 591/600, పి. భవజ్ఞ 587/600 ,యం. రిజాయిస్ బాబు 587/600, పి జ్ఞాన ప్రసూన 586/600, పి గాయత్రి 584/600 , కె. ఏకవల్లి 583/600, జె.సూజన్ 582/600 మార్కులు సాధించారు. 8 మంది 580 పైగా, 14 మంది 570 పైగా, 22 మంది 560 పైగా, 61 మంది 500 మార్కులు పైగా సాధించారు. స్కూల్ యావరేజ్ మార్క్ 525 కాగా తెలుగు లో 100/100 మార్కులు ముగ్గురికి, హిందీలో 100/100 మార్కులు ఇద్దరికి, గణితంలో 100/100మార్కులు 11 మందికి, సైన్స్ లో 100/100 మార్కులు ఆరుగురికి, సోషల్ లో 100/100 మార్కులు ఇద్దరు సాధించారు. వీరికి భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ,వైస్ చైర్మన్ హనుమంతరావు, డైరెక్టర్ సాకేత్ రామ్ ,జోనల్ ఆఫీసర్ జె.వి. శ్రీనివాస్ , ప్రిన్సిపల్ సిహెచ్ .రవి మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.