అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం….ఎమ్మెల్యే వేగుళ్ళ..

జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ మే 1 అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.
రాయవరం మండలం, పసలపూడి గ్రామంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు పలు అభివృద్ది పనులకు శంఖుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.22.00 లక్షలు, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.40.00 లక్షలతో గ్రామంలో నిర్మించిన సి.సి.రోడ్లు, డ్రైన్లు ను ప్రారంభించారు. అదేవిధంగా సొసైటి వద్ద, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి వీధిలో ఏర్పాటుచేసిన కొత్త ట్రాన్స్ ఫార్మర్స్ ను ప్రారంభించారు. అనంతరం రూ.36.00 లక్షలతో విలేజ్ హెల్త్ క్లీనిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రామచంద్రా పురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, మల్లిడి సూరెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, అనుసూరి శ్రీనివాసరావు, పడాల సత్యనారాయణ రెడ్డి, బుంగ పెద్ద, కొల్లి చంటిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.