సిమెంట్ రహదారి పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 21 కంటోన్మెంట్ నియోజకవర్గం లోని మోండా డివిజన్ లో 48 లక్షల రూపాయలతో వేయనున్న సిమెంట్ రహదారి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నుండి ఆయుష్ కార్యాలయం వరకు వేయనున్న సిమెంట్ రహదారి పనులను ఎమ్మెల్యే అధికారులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డివిజన్ లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయించి ఎక్కడ అవసరం అయితే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, మోండా డివిజన్ ను ఆదర్శవంతం గా తిర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఢాకు నాయక్, డిప్యూటీ ఇంజినీర్ దీపిక, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, టెంపుల్ కమిటీ చైర్మన్ లు అరవింద్ యాదవ్, గౌరీ శంకర్, వెంకట్రాజు, శేఖర్ ముదిరాజ్, నందికంటి రవి, బాబూరావు, శ్రీనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *