సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 21 కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం పికెట్ లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గంలోని 62 కుటుంబాలకు వైద్య సహాయానికి సంబంధించి మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి ( సి ఎం ఆర్ ఎస్) చెక్కులను ప్రభుత్వ సహాయం పొందుతున్న కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చెక్కులను పొందిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో పేద ప్రజలకు వైద్య సహాయం అందజేయడం కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతగా భావించి, ప్రభుత్వ వైద్యశాలల్లో మంచి డాక్టర్ల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తుందని, కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్లి ఆర్ధిక ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పారు.