సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గాడ్ మార్చి 21 కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పలు వార్డులలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు బీజేపీ అభిమానులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.దాంట్లో భాగంగా ముఖ్యంగా కార్కాన, వార్డు నం. 3 లోని శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయంలో పూజ అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డ్ 4 లోని వై యం సి ఎ గణేష్ ఆలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంజీవయ్య కాలనీ, చిన్నతోకట్ట, వార్డు నం.1 లోని కమ్యూనిటీ హాల్‌కు 75 కుర్చీల పంపిణీ చేయడం జరిగింది. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ గేటు వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డ్ 1 బాపూజీనగర్, బోయిన్పల్లి, లోని అమ్మవారి ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం మరియు బస్తీ వాసులకు కూరగాయల పంపిణీని నిర్వహించడం జరిగింది.
మనోవికాస్ నగర్ ప్రాంగణంలో దివ్యాంగులకు సుమారు 50 పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డ్ 6లోని సీతారాంపూర్ శ్రీనివాస్ కాలనీలో సమైక్య మహిళా గ్రూపు సభ్యులకు 50 కుర్చీల పంపిణీ చేసి,అక్కడి బస్తీ వాసులకు కూరగాయల పంపిణీని నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాపూజి నగర్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం శామీర్‌పేట్ లో గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారిని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
