నాగర్ కర్నూల్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శిగా మద్దెల రామనాథం

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 21 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల ప్రకటించిన డిసిసి కమిటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి మద్దెల రామనాథం నియమితులయ్యారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులను గుర్తించి సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన అధిష్టానానికి మరియు పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *