సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 21 అచ్చంపేట రిపోర్టర్(కొమ్ము రేణయ్య) ఇటివల జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి కమిటీని ప్రకటించిన అధిష్టానం నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాలలో కొత్తవారికి కాంగ్రెస్ పార్టీ మండల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ క్రమంలోనే అచ్చంపేట నియోజకవర్గంలో 8 మండలాల్లో నూతన క్యాడర్ కు పదవులు దక్కే అవకాశాలు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం.అన్ని సామాజిక వర్గాలను సంతృప్తి పరిచే విధంగా మండల నాయకత్వాన్ని త్వరలో ప్రకటించేందుకు నివేదిక తయారు చేసినట్లు సమాచారం.ఆ దిశగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కొద్ది రోజుల్లో మండలాల నూతన అధ్యక్షుల ప్రకటన చేయనున్నట్లు సమాచారం.సాక్షి డిజిటల్ న్యూస్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చంపేట నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల వారిగా నూతన అధ్యక్షులుగా చారగొండ మండలం భీముడు నాయక్,వంగూరు మండలం రాజశేఖర్ రెడ్డి, ఉప్పునూతల మండలం లక్ష్మినారాయణ అడ్వకేట్,అచ్చంపేట మండలం కొమ్ము బుచ్చిరాములు,బల్మూరు మండలం రాంప్రసాద్ గౌడ్, లింగాల మండలం నారాయణ గౌడ్, అమ్రాబాద్ మండలం రహీం,పదర మండలం మాణిక్యం,అచ్చంపేట టౌన్ ఖాదర్ ల పేర్లు దాదాపు ఖరారు కాగా అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.