తిరుమలగిరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి న జిల్లా ఎస్పి నరసింహ

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 20 తిరుమలగిరి మండలం సూర్యాపేట జిల్లా, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎస్.పి నరసింహ శుక్రవారం నాడు, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డ్స్ ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ, మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, రికార్డు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల,మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి భరోసా కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుండి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాలు మహిళల భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బంది అందరూ జట్టుగా పనిచేసే మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, గుత్త, వెంకటరెడ్డి కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *