కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో మాదిగలు, ముస్లింలకు తీవ్ర అన్యాయం

*ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సౌట కాశీం మాదిగ


సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 21 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) కాంగ్రెస్ పార్టీ అధికారకంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కమిటీలో మాదిగలు మరియు ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుండ జిల్లా మంత్రి,ఎమ్మెల్యేలు అన్యాయం చేయడం సరికాదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సౌట కాశీం నాయకులు అన్నారు. జిల్లా కమిటీలో మొత్తం 32 మంది సభ్యులు ఉండగా అందులో 10 మంది రెడ్డిలకు మరియు ఇద్దరు వెలమలకు ప్రాతినిధ్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్కరికి మాత్రమే ఆవకాశం కల్పించి ముస్లింలకు అసలు ప్రాతినిధ్యం కల్పించలేదని అన్నారు. జిల్లాలో 5 శాతం జనాభా లేని రెడ్డిలకు 10 పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 12 శాతం జనాభా కలిగిన మాదిగలకు ఒకరికి మాత్రమే పదవి ఇవ్వడం బట్టి కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని మరోసారి నిరూపణ అయిందని అన్నారు. వెంటనే నాగర్ కర్నూల్ డిసిసి కమిటీని రద్దుచేసి జనాభా ప్రతిపాదికన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.లోక్ సభ,రాజ్యసభలో కూడా మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించా లన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం వైఖరి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మాదిగల సత్తా చూపుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *