మోండా డివిజన్ షెనాయ్ గ్రౌండ్స్ లో రేపు నిర్వహించే కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 15, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా ఆదివారం ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు వెస్ట్ మారేడ్ పల్లి లోని షెనాయ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని మోండా డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని డిపార్ట్మెంట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటున్నారని, కావున మోండా డివిజన్ ప్రజలు తమకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ కార్యక్రమానికి విచ్చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేస్తే సమస్యల పరిష్కారం సులువుతుందని అన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఆరోగ్య, పారిశుద్ధ్య, డ్రైనేజ్, పార్కులు, ఇంజనీరింగ్, రెవిన్యూ, పౌరసరఫరాలు, పోలీస్ శాఖలు సహా ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారని, కావున డివిజన్ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *