ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్లు శుభ్రం చేసిన మహిళా సర్పంచ్

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య)99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బల్మూరు మండలంలోని గోదల్ గ్రామ సర్పంచ్ పంబ ఇందిరా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షించారు.అనంతరం ఊరిలో వార్డులను సందర్శించి స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు.గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాధ్యత అని గుర్తు చేశారు.అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పదిరే శ్రీదేవి, వార్డు సభ్యులు బుసిరాజు సైదులు, పంచాయతీ కార్యదర్శి భీముడు మరియు పంచాయితీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.