ధనలక్ష్మి కాలనీ, వార్డు నం.1 లో నూతన త్రాగునీటి పైపులైన్ పనులు ప్రారంభం.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 15, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ధనలక్ష్మి కాలనీ, వార్డు నం.1 లో గత 20 రోజులుగా త్రాగునీటి పైపులైన్ ద్వారా మురికినీరు సరఫరా అవుతున్న సమస్యను కాలనీ వాసులు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లిఖార్జున్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన నర్మద భానుక వాటర్ వర్క్స్ విభాగం ఏ ఇ శ్రీ శశాంక్ కి సమాచారం ఇచ్చి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం ఏఈ అక్కడి పరిస్థితులను పరిశీలించి పాత పైపులైన్ స్థానంలో నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీనిపై వెంటనే కంటోన్మెంట్ బోర్డు సిఇఒ గారిని సంప్రదించి నూతన పైపులైన్ మంజూరు చేయించడంతో ఈరోజు పనులు ప్రారంభించ బడినాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మల్లారెడ్డి, రవి, రాఘవయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *