తొలిరోజు ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పరీక్ష

*మన్ననూర్ లో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాణావత్ సంతోష్ ---


సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 అచ్చంపేట రిపోర్టర్(కొమ్ము రేణయ్య) నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 60 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షలో 10651 మంది విద్యార్థులకు గాను 10630 మంది పరీక్ష రాశారు 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తొలి రోజు తెలుగు పరీక్షకు 98.80 శాతం హాజరు నమోదయిందని డిఇఓ రమేష్ కుమార్ తెలిపారు.అదే విధంగా ఇదివరకు పరీక్షల్లో తప్పిన ప్రైవేట్ విద్యార్థులు 5 మంది గాను నలుగురు విద్యార్థులు హాజరుకాగా ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు తెలిపారు. అదేవిధంగా శనివారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.త్రాగునీరు,వైద్య శిబిరాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు.తొలి రోజు పరీక్ష రాసిన విద్యార్థుల హాజరుపై కలెక్టర్ ఆరా తీశారు.పరీక్ష కేంద్రంలో 25 విద్యార్థులకు గాను 24 మంది హాజరయ్యారని ఒక విద్యార్థి గైర్హాజరు అయినట్లు సిఎస్ కలెక్టర్ కు తెలిపారు.విద్యార్థి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కాకుండా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిఎస్ డిఇఓ ను ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో అధికారులు తొలిరోజు తనిఖీలు చేసినట్లు డీఈవో తెలిపారు.జిల్లావ్యాప్తంగా 4 ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు 34 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు డిఇఓ తెలిపారు.తొలి రోజు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డిఇఒ రమేష్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *