కంటోన్మెంట్ సమస్యలపై సుధీర్గ చర్చ బానుక నర్మదా మల్లికార్జున్.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 15, కంటోన్మెంట్ కమాండ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ (పీడీ) రవీంద్ర ఈరోజు స్థానిక కంటోన్మెంట్ బోర్డును సందర్శించిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ . అనంతరం వారి తో సమావేశం లో పాల్గొని కంటోన్మెంట్ లోని పలు సమస్యలు పైన సుదీర్ఘ చర్చ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బానుక నర్మద మాట్లాడుతూ గతంలో నేను ఉపాధ్యక్షరాలుగా, బోర్డ్ మెంబర్ట్ పీడీ హోదా గా మళ్ళీ మన కంటోన్మెంట్ కు రావడం చాలా సంతోషంగా ఉంది అని ఇటీవల డిఫెన్స్ నుండి సర్వీస్ చార్జెస్ క్రింద సుమారు 9 కోట్ల వరకు మరియు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ క్రింద సుమారు 14.50 కోట్ల వరకు మన కంటోన్మెంట్ బోర్డ్ కు రావడం హర్షణీయం అని అలాగే మన కంటోన్మెంట్ లో అత్యవసరంగా చేపట్టవలసిన అభివృధి పనులను గుర్తించి సుమారు 18.50 కోట్ల వ్యయం అంచనా వేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది అని ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ ఈ జాబితాను వారి లెటర్ తో కేంద్ర ప్రభుత్వం కి పంపివడం జరిగింది.ఆది మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి స్థానిక బోర్డ్ సీఈఓ కి బానుక నర్మద గుర్తించిన ఈ 18.50 కోట్ల పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో జాబితాను రూపొందించాలని నివేదిక రావడం హర్షణీయం అని,అలాగే FSI 2.0 వరకు రావాలని అని,అలాగే ఇటీవల కాలం లో తాము ఇచ్చినా వినతి పత్రాల పైన కూడా దృష్టి పెట్టాలని అలాగే కంటోన్మెంట్ బోర్డ్ కు రావాల్సిన ప్రత్యేక నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని వారిని కోరడం జరిగింది. వీటన్నింటి పైన సానుకూలంగా స్పందిస్తూ పీడీ త్వరలో మన కంటోన్మెంట్ బోర్డు లోని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం అని వారు హామీ ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ అరవింద్ కుమార్ , డిఈఓ దినేష్ రెడ్డి మరియు
కంటోన్మెంట్ బోర్డు అధికారులు పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *