9 వ వార్డు లో క్లీన్ అండ్ గ్రీన్

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 15/2026, ఖమ్మం జిల్లా వైరా కాంటెన్సీ ఇంచార్జ్, వైరా మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ శనివారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంగారావు, జిల్లా కాంగ్రెస్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ తో కలిసి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కట్ల సంతోష్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం 99 రోజులపాటు కొనసాగుతుంది ,ఈ కార్యక్రమంలో పారిశుద్ధ సమస్యల ,పరిష్కారం క్లీన్ అండ్ గ్రీన్ తో పాటు పెండింగ్ పనులు అన్ని పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు .ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా వ్యవసాయ సంచాలకులు తుమ్మలపల్లి కరుణశ్రీ, మార్కెట్ కార్యదర్శి మొషిన్ సుల్తానా,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, పమ్మి అశోక్, వీరంశెట్టి సీతారాములు, మిట్టపల్లి రాఘవరావు, కంభంపాటి సత్యనారాయణ, తెళ్ళురి వీరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఐవి నాగేశ్వరావు, నవీన్, ముదిగుండ్ల మహేష్, తోటకూర శ్రీకాంత్, గంగవరపు కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *