(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ మార్చ్ 15) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ అధికారికి ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఎన్ హెచ్ ఎం ద్వారా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సరిపడ నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన పారితోషికాలను వెంటనే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 పారితోషికాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఉన్న ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మార్చి 16, 17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు, మార్చి 20న మంత్రుల నివాసాల ముందు నిరసనలు, అలాగే మార్చి 28న “చలో హైదరాబాద్” కార్యక్రమంతో అసెంబ్లీ ముట్టడి చేపడతామని తెలిపార