సంపాదన కన్నా ప్రజా సంక్షేమమే మిన్నజనసేన పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సినిమాల్లోని సంపాదన కన్నా రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే మిన్నగా భావించి నట్లు రామకుప్పం మండల జనసేన పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ పేర్కొన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం స్థానిక వైయస్సార్ సర్కిల్ నందు జనసేన పార్టీ జెండాను కూటమినేతలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు మరిన్ని రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కూటమినేతలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ కార్యదర్శి కామ్రాజు నాయక్ మాజీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు నరసింహులు జనసేన పార్టీ నేతలు పవన్ శ్రీకాంత్ భాస్కర్ గంగాధర్ వినోద్ చరణ్ గజేంద్ర ఆన్ జపాన్ సురేష్ బీజేపీ నేతలు ఆంజనేయులు రాజసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *