సాక్షి డిజిటల్ న్యూస్14/3/2026 రిపోర్టర్ సాయికిరణ్, షాబాద్ మండల కేంద్రం తో పాటు షాబాద్ గ్రామంలో మరియు పరిసర ప్రాంత గ్రామాలలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని షాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తెలిపారు . ఈరోజు షాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి సెంటర్ ఏర్పాటయింది మొదటి పరీక్ష వ్రాసిన అనంతరం విద్యార్థిని విద్యార్థులు తమ ఊర్లకు తిరుగు ప్రయాణమయ్యారు ప్రతిరోజు మధ్యాహ్నం వరకు పదవ తరగతి పరీక్షలు ఉంటాయని మధ్యాహ్నం తర్వాత పాఠశాలలు ఉండవని 16 నుంచి ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు అందరికీ ఒంటిపూట బడులు కొనసాగు తాయని తెలిపారు.