సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15 గూడూరు రిపోర్టర్ (చెన్నూరు మస్తాన్ ) గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీకంటి రామ్మోహనరావు, రాజ్యలక్ష్మి దంపతుల దాతృత్వంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి శనివారం దాతల సాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రుడు కావాలని కోరారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పేపళ్ళ అమరయ్య నాయుడు, కొమ్మా రవీంద్ర బాబు, పర్వతాల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.