సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమెల గ్రామంలో శ్రీలక్ష్మి అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా, స్వామివారి కల్యాణ మహోత్సవంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా కాట సుధా మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే అద్భుతమైన వేడుకలు భక్తులకు మనోనందాన్ని కలిగిస్తాయని, ఇలాంటి పవిత్రమైన బ్రహ్మోత్సవాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు.