శివ నందీశ్ బాబు ఆద్వర్యంలో యవతలో ఉర్రూతలూగించిన యూత్ ఉత్సవాలు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) మార్చి 15: తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో ఉమ్మడి విశాఖ జిల్లా యువజన విభాగం మాజీ అద్యుక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు ఆద్వర్యంలో “అంగరంగ వైభవంగా” జాతీయ స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు.గతంలో కంటే నందీశ్ బాబు సమలీకృతం లో ఈ వేడుకలు అందరని అబ్బుర పరిచే విధంగా ఆకట్టుకున్నాయి అని పలు విద్తా సంస్థల అధినేత లు, వీక్షకులు కొనియాడారు.యవతలో జోష్ నింపాలనే ఆలోచనతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ గాయని గీతా మాధురి చేత గీతాలు ఆలపించారు.గీతా మాదురి ఆలపించిన గీతాలు యువతలో జోష్ ని నింపాయి.ఈ యువజనోత్సవాలు లో భాగంగా మత్తంశెట్టి శివ నందీష్ బాబు విద్యార్థులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు బాస్కెట్ బాల్, కబడ్డీ, వాలీబాల్, కోకో, క్రికెట్, త్రోబాల్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, స్లో బైక్ రేస్, ట్రెజరీ హంట్, పాటలు పోటీలు, సోలో నృత్యం, గ్రూప్ డాన్సులు, స్కిట్స్, స్పాట్ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, ఎడ్వర్టైజ్మెంట్ కాంపిటేషన్, ఫేస్ పెయింటింగ్ కాంపిటేషన్, ఫ్యాషన్ షో, రాంప్ వాక్, రాక్ బ్యాండ్, బాడీ బిల్డింగ్, మెమేస్ క్రియేషన్ ఇలా పలు రకాలైన క్రీడలు నిర్వహించారు. టాటా ఎక్స్పో మోటార్ బైక్స్ కార్స్ రేసింగ్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ను ఉద్దేశించి శివ నందీశ్ బాబు మాట్లాడుతూ అవంతి ఇంజినీరింగ్ కళాశాల లు అనేవి కేవలం విద్య ను నేర్పే విద్యా సంస్థల మాత్రమే కాదని విద్య తో పాటు క్రీడలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు,ఉపాది కల్పన, కల్పించే ఒక గని నిది అని అన్నారు.అవంతి విద్యా సంస్థల లో విద్యార్థులు ను విద్యార్థులు గా కాకుండా తమ సొంత గృహంలో ఉన్నామనే భావన కలుగుతుంది అనే మాటను విద్యార్థులు నుంచి వింటుంటే మాకు ఎంతో గర్వకారణం ఉంటుంది అని తెలిపారు.యవతలో విద్య తో పాటు పలు రంగాల్లో వారి నైపుణ్యాలను భయటకు తీయాలనే ఆలోచన తోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లో మరిన్ని నిర్వహిస్తామని శివ నందీశ్ తెలిపారు.ఈవెంట్స్ సంపూర్ణంగా విజయం వంతం కావడంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక,జనరల్ సెక్రెటరీ, ఐ. శ్రావణ్ కుమార్,మేనేజింగ్ డైరెక్టర్, అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ డా. బి. మురళీకృష్ణ, ఫార్మసీ ప్రిన్సిపాల్ డా. పూర్ణ నాగశ్రీ, డైరెక్టర్ ఎడ్మిన్ ఎస్. విశ్వ ప్రసాద్,డిగ్రీ ప్రిన్సిపాల్ పిన్నింటి రామకృష్ణ, డిప్లామో ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి జగదీశ్వర్రావు ప్రోగ్రామ్ కన్వీనర్స్ డా. షరీఫ్,డా. రాము,పిడి కోలా చంద్ర శేఖర్,అవంతి ప్రియ శిష్యుడు భాగం స్వాతి సుధాకర్, వివిధ విభాగాధి పతులు, అధ్యాపకులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, భోదన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *