వేసవిలో ఆరోగ్య రక్షణకు మజ్జిగే ఉత్తమ పానీయం – గండిపల్లి రాజు…..

*డీహైడ్రేషన్‌కు చెక్… మజ్జిగతో ఆరోగ్య రక్షణ వేసవిలో నీరు,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి – గండిపల్లి రాజు…

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15,2026 మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్ వేసవికాలం ప్రారంభ మవుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బోడుప్పల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు గండిపల్లి రాజు సూచించారు.రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు.ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని గండిపల్లి రాజు తెలిపారు. మజ్జిగ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి ఎండల వల్ల కలిగే అలసటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాగే మజ్జిగలో ఉన్న పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. భోజనం చేసిన తరువాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గి శరీరానికి తేలికగా అనిపిస్తుందని ఆయన వివరించారు. వేసవికాలంలో ఎక్కువగా కనిపించే డీహైడ్రేషన్ సమస్యలను నివారించడంలో కూడా మజ్జిగ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.మజ్జిగలో కాల్షియం, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి శక్తి లభిస్తుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు మహిళలు ప్రతిరోజూ మజ్జిగ తీసుకోవాలని సూచించారు. మజ్జిగలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కరివేపాకు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని చెప్పారు.వేసవికాలంలో ప్రజలు ఎక్కువగా నీరు తాగుతూ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటి సహజమైన చల్లని పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బోడుప్పల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు గండిపల్లి రాజు ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *