విజ్జన్న చొరవతో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం

*7వ వార్డు కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్

సాక్షి డిజిటల్ న్యూస్, 15 మార్చ్ 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ తిరుకోవళ్లూరి సంజయ్ : పెద్దపల్లి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టార ని 7వ వార్డు కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్ తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. వరప్రదీప్ ఆధ్వర్యంలో యాదవ సంఘం కుల పెద్దలతో పాటు సంబంధిత ఏఈతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన బిల్డింగ్ అంచనాలు, నిర్మాణ విధానం, స్థల పరిశీలన తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. త్వరలోనే పనులు ప్రారంభించి యాదవ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వరప్రదీప్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణరావు సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం ఆనందకరమని అన్నారు. ఈ హాల్ ద్వారా యాదవ సంఘానికి చెందిన ప్రజలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కుల పెద్దలు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *