సాక్షిడిజిటల్ న్యూస్ ,వేంపల్లె,మార్చి :15( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వాహన దారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ టి.నరసింహులు తెలిపారు. శనివారం రాయచోటి – వేంపల్లె బైపాస్ నందు గల రవి రెడ్డి పెట్రోల్ బంకు వద్ద తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించారు. అనంతరం సీఐ టి.నరసింహులు మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. వాహనాల రికార్డులు తప్పనిసరిగా ఉంచుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్ లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. వీటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, వాహన పత్రాలు, తమ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు కిరణ్, శీనివాసులు, విష్ణు పాల్గొన్నారు.