సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15. శంకరపట్నం కరీంనగర్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాజు. !! కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయ గూడెంలో రాజకీయం చెలరేగుతుంది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొడవలు సృష్టించేందుకు. కుట్రలు కుతంత్రాలు రాజకీయ కుట్రలు తెర వెనక కుట్రలు చేస్తున్న వారెవరు? రెచ్చగొడుతున్న వారెవరనే ప్రశ్న ఉత్పన్నం కావడం జరుగుతుంది ,దీంతో గ్రామంలో గొడవలకు దారికి పరిస్థితులు నెలకొన్నట్లు గ్రామస్తులు చెప్పారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా రాజకీయ చిచ్చు రోజురోజుకు చలో రేగుతుందన్నారు .ఈ చిచ్చు రాజకీయ ఉనికి కోసమా? ఆర్థికంగా లాభం పొందే వ్యవహారమా. ? అనే అనుమానాలు కూడా ఉన్నాయని వారన్నారు . చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడమా? కావాలనే.రచ్చ చేస్తున్నారా? అనే సందేహాలు కూడా ఉన్నాయని వారన్నారు . గ్రామంలో రచ్చ జరుగుతున్న తీరు బట్టి గొడవలు దారి తీసే పరిణామాలపై ఇలాంటి పరిస్థితిపై నలుగురు ఉన్నచోట నాలుగు రకాలుగా చర్చించు కుంటున్నారు. ఇందుకు రాత్రి వేళలో ఇరు వర్గాల వారు కొందరు పీకలదాకా మద్యం సేవించి గొడవలు సృష్టించేందుకు కీలక పాత్ర పోషించడం రాజకీయ రచ్చకు దిగడంపై ఒక్కసారిగా రాజకీయం రగడ తెరపైకి వచ్చింది చెట్ల నరికివేత వాటర్ ప్లాంట్ మూసివేత పై ఇరువర్గాలు చర్చించుకోవలసిన అవసరం ఉండగా ఇందుకు విరుద్ధంగా ఇరువర్గాల ఉనికి కోసం. రచ్చ రాజకీయాలు చేయటం గ్రామంలో రాజకీయ చిచ్చుకు ఊతం పోసి చేతులు దులుపుకునే ప్రయత్నమా? అనే అనుమానాలు కూడా గ్రామంలో వ్యక్తమవడం దీనికి కొందరు ఉప్పందించడంతో రోజుకో తీరు రాజకీయం చెలరేగుతుంది రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు విమర్శలతో ఇరువర్గాలు రెచ్చిపోవడంతో గొడవలకు దారి తీస్తుందనే అభిప్రాయం గ్రామంలో ఉంది . గ్రామంలో ఇలాంటి గొడవలకు తెరవెనుకున్న రాజకీయాలపై పలువురు పలు రకాలుగా చర్చించు కుంటున్నారు గొడవలకు సూత్రధారులు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం కావడంతో గొడవ రాజకీయాలు వాతావరణ పరిణామాలు పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణలకు దిగజారడం పరిస్థితులను ఇ రువర్గాలు అనుకూలంగా చేసుకునే వ్యవహారంపై కూడా గ్రామంలో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రశాంతమైన పల్లెలో కూడా పగలు ప్రతికారాలు కు రెచ్చగొట్టే వ్యవహారాలను చూసి జనం పలు రకాలుగా పలు విధాలుగా నలుగురున్నచోట చర్చించుకుంటున్నారు.