రైతుల సమస్యల పరిష్కారం కొరకు రైతు ప్రజా సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా

*మద్దతు ప్రకటించిన హుజురాబాద్ బీసీ జేఏసీ

హుజురాబాద్ మార్చి 15 సాక్షి డిజిటల్ న్యూస్ హుజరాబాద్ రూరల్ ముషం రమేష్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద రైతు ప్రజా సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ప్రజా సంఘాల నాయకులు ముచ్చెసమ్మిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ సందేల వెంకన్న తమ సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రైతులకు రైతు భరోసా ను ప్రతి సంవత్సరము వర్షాకాలము వేసంగి పంటలకు పెట్టుబడి రూపంలో రైతు భరోసా నిధులను మంజూరు చేయవలసి ఉన్నప్పటికీ ఐదు పంటలకు గాను కేవలము రెండే రెండు సార్లు రైతు భరోసా నిధులను రైతులకు మంజూరు చేయడము రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమన నీతికి నిదర్శనం అన్నారు అదేవిధంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అందరి రైతులకు రుణమాఫీ కాకపోవడం మాత్రమే కాకుండా సన్న వరి ధాన్యానికి సంబంధించి అందరి రైతులకు సబ్సిడీ అంతకపోవడం పట్ల తమ ఆవే దన వ్యక్తం చేసినారు దేశానికి వెన్నెముకైనా రైతులు నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని లేనిచో బీసీ జేఏసీ పక్షాన రైతుల సమస్యల పరిష్కారం కొరకు రైతు ప్రజా సంఘాల కార్యాచరణ సమితి భవిష్యత్తులో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల జాతీయ నాయకులు పోలాడి రామారావు మర్రి వెంకటస్వామి రాష్ట్ర నాయకులు గూడూరి స్వామి రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు ఎడవల్లి కుండాల్ రెడ్డి బండి అయిలయ్య కంకణాల సరోజన కాశిరెడ్డి మహేందర్ రెడ్డి గోలి సరోజన పుర్రె మల్లయ్య చెవుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *