రేండ్లగూడ గ్రామ గొల్లవాడ కాలనీలో అగ్గి మల్లన్న దేవస్థానం ప్రతిష్టాపన

*భారీగా తరలివచ్చిన భక్తులు గజ స్థంభం విగ్రహాల ఆవిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామపంచాయతీ పరిధిలో గల యాదవ కాలనీ గొల్లవాడ ఊరు చివరలోనే గ్రామస్తులు అందరూ స్థల సేకరణ చేసి విరాళాల రూపంలో ఆర్థికంగా నిధి జమతో అగ్గి మల్లన్న దేవుడి గుడిని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రసాదములు భోజనంలు భక్తులకు అన్ని సౌకర్యాలతో ఆనందకరమైన ఆధ్యాత్మిక వాతావరణం ఆలయ కమిటీ నిర్వహకులు బ్రాహ్మణోత్తములతో పూజలు జరుపుతున్నారు భారీ జాతర జరగడం మండలంలోని ప్రజలు పక్క మండలం జిల్లాలలోని ప్రజానికం భారీగా తరలిరావడం విశిష్టతను కనబరిచింది కొమరవెల్లి మల్లన్న దేవస్థానం తర్వాత రెండో స్థానాన్ని చేరబోతున్న గుడిగా అవతరించబోతుందని భక్తులు అన్నారు. గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువత సబండ ప్రజానికం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *