రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి:15, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్, కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కలిసి విన్నవించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేయటం జరిగింది.. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారిని కలసి స్థల పరిశీలన మరియు వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి మరియు నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించి నట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.