రంజాన్ పండుగ సందర్బంగా తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) ఖమ్మం రూరల్ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల ముస్లిం కుటుంబాలకి ప్రజా ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్ల పంపకం వరంగల్ క్రాస్ రోడ్ లోని మసీద్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధి గా రెవిన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ పోకబత్తిన అనిత , వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ పాల్గొని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ముస్లిం కుటుంబలకి ప్రభుత్వం తరుపున తోఫా కిట్లు అందించారు. ఈ సందర్బంగా దయాకర్ రెడ్డి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య మంత్రి దివంగత వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనారిటీ లకు రిజర్వేషన్ కల్పించిన విషయం ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. ఏ పథకం అమలు చేయాలి అన్న అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది అని, రాబోయే రోజుల్లో ముస్లిం మైనారిటీ కి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వక్క హామీ నేరవేరుస్తారు మన శ్రీనన్న అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఏదులాపురం మున్సిపల్ కౌన్సిలర్ లు వెంపటి ఉమా, బానోత్ దివ్య,బుర్ర మహేష్, కడవ నవీన్, బానోత్ ప్రసాద్, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాధిక్ అలీ,పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్. పి. చారీ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, నూకల రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం శేషి రెడ్డి వెంపటి సురేష్, వెంపటి రవి,ఎండ్ హుస్సేన్,బానోత్ కిషోర్, హరి, రంజిత్ నాయక్ ముస్లిం సోదర సోదరిమణులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *