సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి.. రామచంద్రాపురం పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని ముస్లింల ఆర్థిక అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని మే ఫెయిర్ సమీపంలో దర్గాలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ సోదరులకు ఈద్ కా తోఫాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మైనార్టీలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సొంత నిధులతో నిరుపేద మైనార్టీలను ఆదుకోవడంతోపాటు.. ఈద్గాలు మసీదులు ఆశిర్ఖానాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ అండగా ఉంటామని తెలిపారు.