అక్షర ఆయుధం, మందమర్రి టౌన్ మార్చ్ 14, మందమర్రి మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99) రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించ బడింది. దీనికి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు హాజరై వారి చేతులమీదుగా ప్రారంభించారు. మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. రాపాక రమేష్ ఆధ్వర్యంలో డా. మనసా పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద వైద్యురాలు డా. నీరజ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు.మున్సిపల్ పారిశుద్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సన్లు, ఓబిలు మెప్మా సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా బి.పి.షుగర్ వంటి పరీక్షల కోసం రక్త నమూనాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసి వైద్య పరీక్షలు చేశారు. అదేవిధంగా బి.పి., షుగర్, థైరాయిడ్ తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ, మున్సిపల్ పారిశుద్య సిబ్బంది ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావంతో వారందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ పి. కృష్ణ ప్రసాద్, ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ. వసంత్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. గోపీకృష్ణ, ఇన్చార్జ్ టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఎ. రఘురాం, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి. శ్యాంబాబు, సిస్టమ్ మేనేజర్ ఎ. శిరీష్,అదేవిధంగా ఎం.ఎల్.హెచ్.పి లు భవాని, శరత్, స్వర్ణలత, సూపర్వైజర్ ఎ. విజయ, ఎ.ఎన్.ఎం లు సుజాత, అనిత, ల్యాబ్ టెక్నీషియన్ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.