మానవత్వాన్ని చాటుకున్న టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 15, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్. నెల్లూరు జిల్లా కోట మండలంలోని అల్లా రెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఆవుల దేశమ్మ వారం రోజుల క్రితం విద్యనభ్యసిస్తున్న తరగతి గదిలోనే స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే హుటాహుటిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ఆ బాలికను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. అయినప్పటికీ పాప ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. ఆ బాలిక నిరుపేద కుటుంబానికి చెందడంతో పాప తల్లిదండ్రులకు మెరుగైన వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో ఆపద్బాంధవుడిలా విషయం తెలుసుకున్న టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సూచనతో పాప వైద్య ఖర్చుల నిమిత్తం తల్లిదండ్రులకు 10,000 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆవుల దేశమ్మ తల్లిదండ్రులు టిడిపి నేత జలీల్ అహ్మద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *