మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి.

★పాల్వంచ డీఎస్పీ. సతీష్ కుమార్.

సాక్షి డిజిటల్ న్యూస్: 15 మార్చి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ పై అవగాహన సమావేశంలో పాల్గొన్న పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును అంధకారం చేస్తాయని హెచ్చరించిన ఆయన, డ్రగ్స్ ను అరికట్టేందు కు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కొందరు డబ్బు సంపాదించాలనే ఆశతో విద్యార్థుల కు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నారని, అటువంటి వారి నుండి దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.