(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్ పల్లి మండలం రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ) మార్చి 15 2026, ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన "బ్యాండ్ మేళం " చిత్ర దర్శకుడు జవ్వాజి సతీష్ ని శనివారం మెట్ పల్లి పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా బిజెపి సీనియర్ నాయకులు బద్దం గంగాధర్ మాట్లాడుతూ, మన ప్రాంతం నుండి వెండి తెరపై మరో దర్శకుని తళక్కుమనడం మన అదృష్టం అన్నారు. ఈ నెల 26 న విడుదల కానున్న చిత్రం భారీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దర్శకుడు సతీష్ మాట్లాడుతూ, నన్ను మాత్రమే కాకుండా, నేను దర్శకత్వం వహించిన సినిమాని కూడా వీక్షించి, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు మగ్గిడి వెంకట నర్సయ్య, పుప్పాల భాను మూర్తి, తోగిటి రాజశేఖర్, కటకం వేణుగోపాల్, పసునూరి శ్రీనివాస్, బిజెపి నాయకులు పీసు రాజేందర్, గోపనవేణి రమేష్, గాజనవేని మహేష్, కల్లూరి అశోక్, మంగ అరుణ్, గూడ కర్రోళ్ల రామ్ రెడ్డి, నందగిరి రాజేంద్రప్రసాద్, ఊళ్ళేంగల మోహన్, వెగ్గెలం చరణ్ ఉన్నారు.