బొంతపల్లి లో అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు

★స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని ఆశీస్సులు పొందిన "కాట దంపతులు"

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ , వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరై భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వారికి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, భక్తుల విశ్వాసం, భాగస్వామ్యంతో ఆలయ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నా యని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలు, సంపదలతో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.