సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శ్రీ బి. ప్రకాష్ శనివారం ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 11.03.2026 రోజు జరిగిన కాంతామణి మహిళ హత్య కేసు సంబంధించిన సంఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి ఘటనపై వివరాలు సేకరించారు. సంఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించి, కేసు దర్యాప్తు వేగవంతంగా మరియు సమగ్రంగా కొనసాగించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, ధర్పల్లి మండలం హోన్నజీపేట గ్రామంలో నమోదైన ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు విషయమై ఏసీపీ గారు గ్రామాన్ని సందర్శించి బాధితులు మరియు గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని చెప్పారు,ఈ సందర్భంగా కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బి. ప్రకాష్ ,తెలిపారు.ఇట్టి విచారణ లో ఏసీపీ గారితో పాటుగా ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) శ్రీ బిక్షపతి గారు, ధర్పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) శ్రీనివాస్ గారు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
