ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం.

*గార్లలో రెండు పరీక్ష కేంద్రాలు.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మండల కేంద్రం లోని ఏ. జి. హెచ్. ఎస్ పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో శనివారం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి గార్ల పట్టణం కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 159 మంది పదోతరగతి విద్యార్థులకు గాను, గైర్హాజర్ లేకుండా మొత్తం విద్యార్థులు హాజరైనారు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కేటాయించిన 145 మంది విద్యార్థులకు గాను, గైర్హాజర్ లేకుండా మొత్తం విద్యార్థులు మొదటి రోజు నిర్వహించిన పరీక్షకు మొత్తం విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. మండల కేంద్రంలో 4 ప్రైవేటు పాఠశాలలు విశ్వశాంతి, సమత, నిర్మల, బి. ఎస్ ‌‌ఎస్ పాఠశాలల విద్యార్థులు, 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, 1 కస్తూర్బా విద్యాలయం,1 ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలకు చెందిన పదవ విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక ఎస్ఐ బి. సాయికుమార్ నేతృత్వంలో ఏ. ఎస్. ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్,పోలీస్ సిబ్బందితో పరిక్షా కేంద్రాల వద్ద ద్వారా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు, పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష హాలు లోనికి పోవడానికి ముందుగానే విద్యార్థులను పరిశీలించి పరీక్ష రాసి హాల్లోనికి పంపించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *