సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 భూమయ్య పిట్లం. . మండల కేంద్రం అయిన పిట్లంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష సిబ్బంది విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి, విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. జెడ్ పి హెచ్ ఏ సెంటర్లో ఒక్క 1 79 విద్యార్థులు, బి సెంటర్లో 158, ఉర్దూ మీడియం సెంటర్లో 191 విద్యార్థులు పరీక్షలు రాశారు.పరీక్ష కేంద్రం వద్ద ఎవరు కూడ రాకుండ పోలీసులు కాపలగ ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కడా కూడ ఎటువంటి ఇబ్బందులు లేకుండ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాశారు.