ప్రజా ప్రభుత్వంలో ప్రగతి వెలుగులు గ్రామాలూ హై మాక్స్ కాంతి వెలుగులు

★గ్రామాల అభివృద్ధే ప్రధాన ఎజెండా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుకృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నేతపురుషోత్తం రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ చింతకింది సిద్దు మార్చి 14 2026 కొందుర్గ్ మండలం రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం లోని ఆయా గ్రామాల్లో ఎల్ ఈ డి లైట్ల కు. భూమి పూజ కార్యక్రమాలు చేపట్టటం జరిగింది
రేగడి చిలకమర్రి, ముట్పూరు, ఉత్తరాస్ పల్లి, టేకులపల్లి, మహదేవ్పూర్, చిన్న ఉమ్మెంతాల, లాలాపేట లో శంకు స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న సహకారంతో హెచ్ యం డి ఏ నిధుల ద్వారా 5 కోట్ల 36 లక్షలు మంజూరు కాగా దానిలో భాగంగా ఈరోజు కొందుర్గు మండలం లో పలు గ్రామాలలో హైమాస్ట్ లైట్స్ మరియు స్ట్రీట్ లైట్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నామమాత్రంగా ఏదో ఒకటో రెండో హైమాస్ట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ కాకుండా జనాభా మరియు విస్తీర్ణం ప్రకారం మండలంలోని అన్ని గ్రామాలకు హైమాస్ట్ మరియు స్ట్రీట్ లైట్స్ మంజూరు చేయడం పట్ల మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.