సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15, మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరము నిర్వహించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ నిపుణులైన వైద్యులచే 282 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితం గా మందులు పంపిణీ చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి,వైద్యాధికారిణి వాహిణి, ఆరోగ్యాధికారి రాం మోహన్, ల్యాబ్ టెక్నీషియన్ దాసరి ఉమా దేవి,కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు ముష్కరి రమేష్, ముత్యాల గంగా రాజం ,భుక్యా శేఖర్, అల్లె చంద్రయ్య,ఏ.వి.ఆర్,మండల ప్రజలు పాల్గొన్నారు.